విమానంలో ధావన్‌ కొంటె పని.! | Shikhar Dhawan Played A Prank On SRH Mates  | Sakshi
Sakshi News home page

Apr 17 2018 3:15 PM | Updated on Apr 17 2018 3:21 PM

Shikhar Dhawan Played A Prank On SRH Mates  - Sakshi

సహచరులను ఆటపట్టిస్తున్న శిఖర్‌ ధావన్‌

మొహాలి : ఈ సీజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని  సోషల్‌ మీడియాలో​ పంచుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ విమానంలో చేసిన ఓ కొంటె పని నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ధావన్‌.. గాఢంగా నిద్రపోతున్న సహచర ఆటగాళ్లు షకీబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌లను ఆటపట్టించాడు. ఓ పేపర్‌ను గుండ్రంగా చుట్టి దానితో ఈ ఆటగాళ్ల ముక్కుల్లో పెడుతూ.. వారిని నిద్ర చెడగొట్టాడు. తొలుత ఏం జరుగుతుందో అర్థం కానీ ఈ ఆటగాళ్లు తేరుకొని ఇది గబ్బర్‌ పనేనని లైట్‌ తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు.

సొంత మైదానంలో రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వారి మైదానంలోనే చిత్తుచేసింది. నాలుగో మ్యాచ్‌ను ఏప్రిల్‌ 19 (గురువారం)న కింగ్స్‌ పంజాబ్‌తో మోహాలీలో ఆడనుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement