భారత ప్రధాన కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ తాజాగా స్సష్టం చేసింది.
న్యూఢిల్లీ:భారత ప్రధాన కోచ్ పదవికి 50పైగా దరఖాస్తులు వచ్చినట్లు బీసీసీఐ తాజాగా స్సష్టం చేసింది. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్తో మరో 55 దరఖాస్తులు వచ్చినట్లు ఆదివారం ఓ ప్రకటనలో బీసీసీఐ వెల్లడించింది. టీమిండియా కోచ్ పదవి అన్వేషణలో భాగంగా దరఖాస్తులకు జూన్ 10వ తేదీని డెడ్ లైన్గా విధించిన సంగతి తెలిసిందే.
'విదేశీ దరఖాస్తులతో కలుపుకుని ప్రధాన కోచ్ పదవికి 57 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దరఖాస్తులు ప్రాథమిక పరిశీలనలో ఉన్నాయి.ఆ తర్వాత అర్హులైన కొంతమందిని పరిశీలించి సమావేశం ఏర్పాటు చేస్తాం. దాని ప్రకారం రూపొందించిన జాబితా మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది' అని బీసీసీఐ తెలిపింది.