వైరల్‌.. బూమ్‌ బూమ్‌ అఫ్రిది! | Shahid Afridi Boom Boom Show In PSL | Sakshi
Sakshi News home page

Mar 16 2018 3:14 PM | Updated on Mar 16 2018 3:34 PM

Shahid Afridi Boom Boom Show In PSL - Sakshi

షాహిద్‌ అఫ్రిది

సాక్షి, స్పోర్ట్స్‌ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిని అభిమానులు బూమ్‌ బూమ్‌ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్‌ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో గురువారం పెషావర్‌ జల్మీ‌, కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది ఏకంగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు సిక్స్‌లు బాదాడు. 

ఇవన్నీ భారీ సిక్సులే కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బూమ్‌ బూమ్‌ అఫ్రిదీ అంటూ తెగ సంబరపడిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐదో బంతిని సైతం సిక్సుకు తరలించాలని భావించిన అఫ్రిది క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లొ అఫ్రిది ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం అఫ్రిది బూమ్‌ బూమ్‌ షో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. అయితే పీఎస్‌ఎల్‌లో ఇది రికార్డు కావడం విశేషం.

ఇక పీఎస్‌ఎల్‌ తొలి దశలో బౌండరీ లైన్‌ వద్ద అఫ్రిది అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. ఈ వీడియో సైతం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement