
ఇస్లామాబాద్: పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌గాంధీ తన చర్చల ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్లు మాత్రం (బీజేపీని ఉద్దేశిస్తూ).. మరో ఇజ్రాయెల్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న ఒక్క ఇజ్రాయెల్ సరిపోదా? అని దుయ్యబట్టారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియాకప్‌లో భారత్-పాక్‌లు తలపడ్డాయి. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారని వారిపై తగు చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు పాక్ ప్రస్తుత ఆటగాళ్లు,మాజీ ఆటగాళ్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా సంస్థ సామ్మాటీవీ ఆసియాకప్‌పై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్‌లో షాహిద్ అఫ్రిది పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం పాజిటివ్ మైండ్‌సెట్ కలిగిన నాయకుడు. సమస్యల పరిష్కారం కోసం సంభాషణే మార్గమని ఆయన నమ్ముతారు. కానీ బీజేపీ మాత్రం ఘర్షణ, విభజన వైపు మొగ్గుచూపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఒక ఇజ్రాయెల్ ఉంది. అది మత, భూభాగ, రాజకీయ వివాదాలతో నిండిన దేశం. మరొక ఇజ్రాయెల్‌ను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా? అని ప్రశ్నిస్తూ ఒక ఇజ్రాయెల్ చాలదా? ఇంకొకటి కావాలా?’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోను అస్త్రంగా పలువురు బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి.. ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీకి ఇప్పుడు కొత్త ఫ్యాన్‌బాయ్ దొరికాడు. అవమానానికి గురైన పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ! అంటూ పేర్కొన్నారు. మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా కూడా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. భారత్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో మిత్రులను కనుగొంటారు. జార్జ్ సోరస్ నుంచి షాహిద్ అఫ్రిదీ వరకు... ఐఎస్‌సీ అంటే ‘ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్’ అని దుయ్యబట్టారు.
🚨This is Fear From Indian Army & Leadership.
Operation Sindoor they will never forget. pic.twitter.com/p77IwsCSiz— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) September 16, 2025