పరుగులివ్వకుండా 3 వికెట్లు డౌన్‌! | Shahid Afridi and Arafat Sunny dismantle Khulna | Sakshi
Sakshi News home page

పరుగులివ్వకుండా 3 వికెట్లు డౌన్‌!

Nov 11 2016 8:37 AM | Updated on Sep 4 2017 7:50 PM

పరుగులివ్వకుండా 3 వికెట్లు డౌన్‌!

పరుగులివ్వకుండా 3 వికెట్లు డౌన్‌!

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌(బీపీఎల్) టీ20 లీగ్‌ లో బంగ్లా బౌలర్‌ ఆరాఫత్‌ సన్నీ సంచలనం నమోదు చేశాడు.

మిర్పూర్‌: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌(బీపీఎల్) టీ20 లీగ్‌ లో బంగ్లా బౌలర్‌ ఆరాఫత్‌ సన్నీ సంచలనం నమోదు చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టాడు. రంగ్ పూర్ రైడర్స్‌, ఖల్నా టిటియన్స్‌ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో అతడీ ఘనత సాధించాడు. రైడర్స్‌ చేతిలో టిటియన్స్‌ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.

రైడర్స్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌ ఆల్‌ రౌండర్‌ షాహిద్ ఆఫ్రిది, ఆరాఫత్‌ సన్నీ ధాటికి టిటియన్స్‌ హడలెత్తింది. బీపీఎల్‌ లోనే అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన టిటియన్స్‌ టీమ్‌ 10.4 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. షువగత(12) ఒక్కడే రెండంకెల స్కోరు చేశారు. నలుగురు డకౌటయ్యారు. ఐదుగురు సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఆఫ్రిది 12 పరుగులిచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు.

45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రైడర్స్‌ ఒక వికెట్‌ నష్టపోయి 8 ఓవర్లలో చేరుకుంది. ఆఫ్రిదికి ’మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement