గారాల పట్టితో సెరెనా విలియమ్స్‌ డాన్స్‌‌ | Serena Williams And Daughter Dance Performance In Home | Sakshi
Sakshi News home page

గారాల పట్టితో సెరెనా విలియమ్స్‌ డాన్స్‌‌

Jun 13 2020 4:47 PM | Updated on Jun 13 2020 8:24 PM

Serena Williams And Daughter Dance Performance In Home - Sakshi

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు ఇంటికే పరిమిమైనప్పటి​కీ తమ రోజువారి విషయాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలరిస్తున్నారు. తాజాగా అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో సెరెనా తన గారాల పట్టి అలెక్సిస్ ఒలింపియా ఓహానియన్‌తో కలిసి బోంజోర్‌ చిత్రంలోని ఒక పాటను పాడుతూ డాన్స్‌ చేశారు. తల్లీకూతుళ్లు ఒకే రకం డ్రెస్‌ ధరించి ఇళ్లంతా తిరుగుతూ సందడి చేశారు. సెరెనా డాన్స్‌ చేస్తుంటే.. అలెక్సిస్‌ తల్లిని అనుసరించింది. (పాక్‌ క్రికెట్‌లో కరోనా కలకలం)

ఈ వీడియోకు సెరెనా ‘కీపింగ్‌ బిజీ’ అని కామెంట్‌ను జత చేశారు. ఈ డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సెరెనా 2017లో అలెక్సిస్‌కి జన్మనిచ్చింది. ఇక టెన్నిస్‌ విషయానికి వస్తే.. 23 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చాంపియన్‌ అయిన ఈ అమెరికా దిగ్గజం బరిలో దిగేందుకు, ఎప్పట్లాగే టెన్నిస్‌ను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల తన సోదరి వీనస్‌తో జరిపిన ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్‌లో తెలిపారు. ప్రస్తుతం సెరెనా హోం క్వారంటైన్‌కి పరిమితమై తన గారాలపట్టితో సరదాగా గడుపుతున్నారు. (మాజీ క్రికెటర్ వసంత్ రాయ్‌జీ ఇక లేరు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement