సెరెనా, జొకోవిచ్‌లకు టాప్ సీడింగ్ | Serena and jokovic to the top seeding | Sakshi
Sakshi News home page

సెరెనా, జొకోవిచ్‌లకు టాప్ సీడింగ్

Jun 25 2015 3:07 AM | Updated on Sep 3 2017 4:18 AM

సెరెనా, జొకోవిచ్‌లకు టాప్ సీడింగ్

సెరెనా, జొకోవిచ్‌లకు టాప్ సీడింగ్

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ సీడింగ్స్ వివరాలను ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో నొవాక్

లండన్ : ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్మెంనట్ సీడింగ్స్ వివరాలను ప్రకటించారు. పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా)లకు టాప్ సీడింగ్ లభించింది. వచ్చే సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) పదో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేని నాదల్ గత మూడేళ్లలో ఒక్కసారి కూడా ఈ టోర్నీలో నాలుగో రౌండ్ దాటి ముందుకెళ్లలేదు.

సీడింగ్ ప్రకారమైతే నాదల్ ఈ ఏడాది నాలుగో రౌండ్‌లోనే అగ్రశ్రేణి ప్రత్యర్థులు జొకోవిచ్, ఫెడరర్, ముర్రేలలో ఒకరితో తలపడే అవకాశముంది. ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు రెండో సీడ్, ఆండీ ముర్రే (బ్రిటన్)కు మూడో సీడ్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)కు మూడో సీడ్‌ను, షరపోవా (రష్యా)కు నాలుగో సీడ్‌ను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement