భారత్‌కు రెండో గెలుపు  | Second Win For The Team India In Fed Cup Asia Oceania | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో గెలుపు 

Mar 6 2020 1:37 AM | Updated on Mar 6 2020 1:37 AM

Second Win For The Team India In Fed Cup Asia Oceania - Sakshi

దుబాయ్‌: ఫెడ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో విజయం లభించింది. దక్షిణ కొరియాతో గురవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోసలే 7–5, 6–4తో జాంగ్‌ సు జియోంగ్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా 4–6, 0–6తో నా లే హాన్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట 6–4, 6–4తో నా లే హాన్‌–నా రి కిమ్‌ జోడీపై గెలిచి భారత్‌ విజయాన్ని ఖాయం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement