హరికృష్ణకు రెండో విజయం | Second win for Harikrishna | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు రెండో విజయం

Jul 31 2017 12:08 AM | Updated on Aug 29 2018 1:16 PM

హరికృష్ణకు రెండో విజయం - Sakshi

హరికృష్ణకు రెండో విజయం

బీల్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని నమోదు చేశాడు.

ఆరో రౌండ్‌లో ప్రపంచ మహిళల చాంపియన్‌ హూ ఇఫాన్‌పై గెలుపు  

న్యూఢిల్లీ: బీల్‌ ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో విజయాన్ని నమోదు చేశాడు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో... ప్రపంచ మహిళల చాంపియన్‌ హూ ఇఫాన్‌ (చైనా)తో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 52 ఎత్తుల్లో గెలిచాడు.

పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో... ఆరో రౌండ్‌ తర్వాత హరికృష్ణ నాలుగు పాయింట్లతో పొనోమరియోవ్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి  సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. 4.5 పాయింట్లతో ఎటెన్ని బాక్రోట్‌ (ఫ్రాన్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు. సోమవారం జరిగే ఏడో రౌండ్‌లో డేవిడ్‌ నవారా (చెక్‌ రిపబ్లిక్‌)తో హరికృష్ణ తలపడతాడు. 

Advertisement
 
Advertisement
Advertisement