రెండో రోజు వర్షార్పణం | second day in hobart match between australia and south africa washed out | Sakshi
Sakshi News home page

రెండో రోజు వర్షార్పణం

Nov 13 2016 12:24 PM | Updated on Sep 4 2017 8:01 PM

రెండో రోజు వర్షార్పణం

రెండో రోజు వర్షార్పణం

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు అడ్డుకున్నాడు.

హోబార్ట్:ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు అడ్డుకున్నాడు. ఆదివారం ఆటకు వర్షం అంతరాయం కల్గించడంతో రెండో రోజు ఆటను రద్దు చేశారు. ఈ రోజు  ఆటలో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ ను నిలిపివేశారు. మరొకవైపు మూడు రోజు కూడా మోస్తరుగా వర్షం పడే అవకాశాలు ఉండగా, నాలుగు, ఐదు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 85 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement