హాంకాంగ్‌పై స్కాట్లాండ్ విజయం | Scotland win in Hong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌పై స్కాట్లాండ్ విజయం

Mar 13 2016 12:35 AM | Updated on Sep 3 2017 7:35 PM

టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ను స్కా ట్లాండ్ జట్టు విజయంతో ముగించింది.

నాగ్‌పూర్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌ను స్కా ట్లాండ్ జట్టు విజయంతో ముగించింది. ఇప్పటికే ఈ గ్రూపు నుంచి అఫ్ఘాన్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిం చగా నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన స్కాట్లాండ్ నెగ్గింది. ఐసీసీ గ్లోబల్ ఈవెంట్‌లో స్కాట్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. చాప్‌మన్ (41 బంతుల్లో 40; 1 ఫోర్; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మకాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.  స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో లక్ష్యాన్ని 10 ఓవర్లలో 76 పరుగులకు కుదించగా... 7.4 ఓవర్లలో రెండు వికెట్లకు 78 పరుగులు చేసి గెలిచింది. క్రాస్ (14 బంతుల్లో 22; 1 ఫోర్; 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement