బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు రేసులో సాత్విక్, చిరాగ్‌

Satwik, Chirag Nominated For Most Improved Player At BWF Awards - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వార్షిక అవార్డుల్లో భాగంగా ‘మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ కేటగిరీలో భారత డబుల్స్‌ ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టిలకు స్థానం లభించింది. ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) జంట థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ నెగ్గడంతోపాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.

‘మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో మిచెల్లి లీ (మహిళల సింగిల్స్‌–కెనడా), కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (మహిళల డబుల్స్‌–కొరియా), ప్రవీణ్‌ జోర్డాన్‌–మేలతి దేవ ఒక్టావియాంతి (మిక్స్‌డ్‌ డబుల్స్‌–ఇండోనేసియా) కూడా ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో భారత్‌కే చెందిన ప్రమోద్‌ భగత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో ఉన్నాడు. ప్రమోద్‌ ఈ ఏడాది జరిగిన పారా బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో మొత్తం 10 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు గెలిచాడు.  ఈనెల 9న చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగే బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ ప్రారంభోత్సవంలో విజేతలను ప్రకటిస్తారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top