సాత్విక్‌ జోడీకి టైటిల్‌  | Satwik and Chirag Shetty make winning return with Brazil International Challenge title | Sakshi
Sakshi News home page

సాత్విక్‌ జోడీకి టైటిల్‌ 

May 7 2019 1:06 AM | Updated on May 7 2019 1:06 AM

 Satwik and Chirag Shetty make winning return with Brazil International Challenge title - Sakshi

క్యాంపినస్‌: బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగుతేజం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. చిరాగ్‌ షెట్టితో జోడీకట్టిన ఈ హైదరాబాదీ షట్లర్‌ పురుషుల డబుల్స్‌లో సత్తాచాటాడు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన తుది పోరులో టాప్‌ సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–14, 21–18తో నెదర్లాండ్స్‌కు చెందిన రెండో సీడ్‌ జెల్లీ మాస్‌–రాబిన్‌ టెబెలింగ్‌ జంటపై విజయం సాధించింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత జోడీ వరుస గేముల్లో ప్రత్యర్థి జంటపై అలవోక విజయం సాధించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement