సత్యన్ సంచలనం

సత్యన్ సంచలనం


ఘసుజో (చైనా) : ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువ ఆటగాడు జి.సత్యన్ సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 188వ ర్యాంకర్ సత్యన్ 4-1 గేమ్‌ల తేడాతో ప్రపంచ 64వ ర్యాంకర్ గెరెల్ పార్ (స్వీడన్)ను బోల్తా కొట్టించాడు.అంతకుముందు జరిగిన అర్హత రౌండ్ చివరి మ్యాచ్‌లో సత్యన్ 11-7, 11-8, 11-8, 11-4 తేడాతో చిలీకి చెందిన ఫెలిప్ ఒలివర్స్‌ను ఓడించాడు. మరోవైపు భారత ప్రధాన ఆటగాడు ఆచంట శరత్ కమల్ తొలి రౌండ్‌లో 4-2తో పార్క్ సిన్ హ్యోక్ (ఉత్తర కొరియా)పై గెలుపొందగా... సౌమ్యజిత్ ఘోష్ 4-1తో ఖాద్రి (నైజీరియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత పొందాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top