‘రజత’ రాజ్‌పుత్ | Sanjeev Rajput wins silver in ISSF World Cup | Sakshi
Sakshi News home page

‘రజత’ రాజ్‌పుత్

Jun 29 2016 12:31 AM | Updated on Sep 4 2017 3:38 AM

ఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌ఫుత్ రజత పతకాన్ని సాధించాడు...

ఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌ఫుత్ రజత పతకాన్ని సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో జరిగిన ఈ ఈవెంట్‌లో రాజ్‌పుత్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో రాజ్‌పుత్ 456.9 పాయింట్లు స్కోరు చేశాడు. భారత్‌కే చెందిన గగన్ నారంగ్ 23వ, చెయిన్ సింగ్ 32వ స్థానంలో నిలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement