క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి | sania mirza team entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

May 1 2014 1:03 AM | Updated on Sep 2 2017 6:44 AM

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

క్వార్టర్ ఫైనల్లో సానియా జోడి

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోర్చుగల్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సానియా..

ఒయిరస్ (పోర్చుగల్): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోర్చుగల్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సానియా.. బుధవారం జరిగిన తొలిరౌండ్‌లో 4-6, 6-2, 10-5 తేడాతో ఇరినా కామెలియా బేగు (రొమేనియా)-మరియా ఇరిజోయెన్ (అర్జెంటీనా) జంటపై గెలుపొందింది.
 
 ఇక పురుషుల డబుల్స్‌లో భారత జోడి దివిజ్ శరణ్-పురవ్ రాజాలకు తొలిరౌండ్‌లో వాకోవర్ లభించింది. క్వార్టర్స్‌లో ఈ జంట టాప్‌సీడ్ పాబ్లో క్వెవాస్-డేవిడ్ మారెరో జోడితో తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కూడా టాప్‌సీడ్ థామస్ బెర్డిచ్‌ను ఎదుర్కొననున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement