కప్ గెలిస్తే టాప్ ర్యాంక్ | Sania Mirza one win away from becoming world number one | Sakshi
Sakshi News home page

కప్ గెలిస్తే టాప్ ర్యాంక్

Apr 12 2015 5:51 PM | Updated on Sep 3 2017 12:13 AM

కప్ గెలిస్తే టాప్ ర్యాంక్

కప్ గెలిస్తే టాప్ ర్యాంక్

మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

చార్లెస్టన్ (యూఎస్‌ఏ): మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్ల్యుటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్‌ టైటిల్ నెగ్గితే సానియా టాప్ ర్యాంకు కైవశం చేసుకుంటుంది.

మార్టినా హింగిస్, సానియా జోడి డబ్ల్యుటీఏ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో రష్యా క్రీడాకారిణులు అల్ల కుద్రియోత్సవా, అస్తాసియా కుద్రియోత్సవాలను 6-4 1-6 10-7 తేడాతో ఓడించారు. రెండో సెట్ కోల్పోయినప్పటికీ మూడో సెట్ లో పోరాడి సానియా, హింగిస్ జోడి విజయం సాధించింది. ఫైనల్లో డెల్లాక్వా, డారిజా జురాక్ తో వీరు తలపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement