ఫైనల్లో సానియా జంట | Sania Mirza in the final couple | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జంట

Sep 26 2015 1:48 AM | Updated on Sep 3 2017 9:58 AM

ఫైనల్లో సానియా జంట

ఫైనల్లో సానియా జంట

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా మరో టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది

గ్వాంగ్‌జూ : ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ సానియా మీర్జా మరో టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తన భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి సానియా గ్వాంగ్‌జూ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో జూలియా గ్లుష్కో (ఇజ్రాయెల్)-రెబెకా పీటర్సన్ (స్వీడన్) జంటపై గెలిచింది.

71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం సానియా ఇప్పటికే ఆరు టైటిల్స్ సాధించింది. అందులో ఐదు మార్టినా హింగిస్‌తో ఉండగా, మరొకటి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement