సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు | Sania Mirza has done India proud: President | Sakshi
Sakshi News home page

సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు

Sep 6 2014 6:21 PM | Updated on Sep 2 2017 12:58 PM

సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు

సానియా మీర్జాకు రాష్ట్రపతి అభినందనలు

యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు.

న్యూఢిల్లీ: యూఎస్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ విజయం ద్వారా సానియా దేశం గర్వించేలా చేసిందని కొనియాడారు.

రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్లో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి ప్రతిగా సానియా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు. యూఎస్ ఓపెన్లో సానియా.. బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సోర్స్తో కలసి టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement