ఫైనల్లో సానియా జోడి | sania mirza entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Apr 27 2014 1:09 AM | Updated on Sep 2 2017 6:33 AM

ఫైనల్లో సానియా జోడి

ఫైనల్లో సానియా జోడి

పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

స్టట్‌గార్ట్: పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్) -కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-కారా బ్లాక్ ద్వయం 6-2, 2-6, 10-4తో అంటోనియా లోట్నెర్-అన్నా జాజా (జర్మనీ) జంటను ఓడించింది.
 
 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. జంకోవిచ్ (సెర్బియా)-అలీసా క్లెబనోవా (రష్యా); సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడిల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో సానియా జంట తలపడుతుంది. డబుల్స్ కెరీర్‌లో 30వసారి డబ్ల్యూటీఏ టోర్నీ ఫైనల్లోకి చేరిన సానియా 19 టైటిల్స్ సాధించి, 10 సార్లు రన్నరప్‌గా నిలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement