మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి | sania mirza and ivan dodig defeated in semi final of australia mixed doubles | Sakshi
Sakshi News home page

మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి

Jan 29 2016 4:40 PM | Updated on Sep 3 2017 4:34 PM

మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి

మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి

ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో టైటిల్ పై సానియా మీర్జా పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది.

మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో టైటిల్ పై సానియా మీర్జా పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా- ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జంట 5-7, 6-7(4/7) తేడాతో ఐదోసీడ్ ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓటమి పాలయ్యారు.  

 

తొలి సెట్ ఆదిలో వెనుకబడిన సానియా జంట ఆ తరువాత పోరాడినా తేరుకోలేపోయింది.  దీంతో తొలి సెట్ ను చేజార్చుకున్న సానియా-ఇవాన్ డోడిగ్లు రెండో సెట్ లో మాత్రం తీవ్రంగా పోరాడారు. రెండో సెట్ లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ ను రెండు సార్లు సానియా జోడి బ్రేక్ చేయగా, వెస్ని జోడి కూడా రెండు సార్లు సానియా ద్వయం సర్వీస్ లను అడ్డుకుంది. దీంతో రెండో సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. హోరాహోరీగా జరిగిన టై బ్రేక్ లో  సానియా జంట 4 పాయింట్లను మాత్రమే సాధించి పరాజయం చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement