సెమీఫైనల్స్లో సానియా జంట | Sania-Martina in Rogers Cup semi-finals | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్స్లో సానియా జంట

Aug 15 2015 5:13 PM | Updated on Sep 3 2017 7:30 AM

సెమీఫైనల్స్లో సానియా జంట

సెమీఫైనల్స్లో సానియా జంట

రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది.

టొరంటో: రోజర్స్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది.  మహిళల డబుల్స్  క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-4, 6-2 తో చాన్ సోదరీమణులు హవో-చాన్, యుంగ్-చాన్ జంటపై గెలిచింది. ఆట ముగిసిన తర్వాత  హింగిస్ మాట్లాడుతూ..  గత మూడు నెలలనుంచి మేం బాగా ఆడుతున్నాం, ముఖ్యంగా వింబుల్డన్ విజయం తర్వాత మా ఆట తీరు సంతృప్తికరంగా ఉందన్నారు.

తొలి రౌండ్ లో కొంచెం వెనకంజలో ఉన్నా ఇద్దరం కలిసి మెరుగ్గా ఆడి విజయం సాధించాం అన్నారు. ప్రతి మ్యాచ్లో ఆటతీరు మెరుగు పరుచుకుంటున్నామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement