
దుబాయ్: నేపాల్ టీనేజ్ స్పిన్నర్ సందీప్ లమిచానేకు కెరీర్ ఆరంభంలోనే చక్కని అవకాశం లభించింది. ఐసీసీ ప్రపంచ ఎలెవన్ జట్టులో అతనికి చోటు దక్కింది. ఈ జట్టు ఓ చారిటీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. గతేడాది హరికేన్ తుఫాన్‌ల వల్ల విండీస్ దీవుల్లోని స్టేడియాలకు తీవ్రనష్టం వాటిల్లింది. వీటికి మరమ్మత్తులు, పునర్నిర్మాణం కోసం లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈ నెల 31న చారిటీ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ స్టార్లు మోర్గాన్ (జట్టు కెప్టెన్) ఆఫ్రిది, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, పెరీరా, లూక్ రోంచి తదితరులతో కలిసి ఆడే అరుదైన అదృష్టం ఇప్పుడు 17 ఏళ్ల లమిచానేకు దక్కింది. ప్రపంచ క్రికెట్ లీగ్ డివిజన్–2లో అతను ఆరు మ్యాచ్‌లాడి 17 వికెట్లతో రాణించాడు. తాజాగా ఐపీఎల్–11లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడ