వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవార్డులలో శామ్యూల్స్ పంట పండింది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవార్డులలో శామ్యూల్స్ పంట పండింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సీనియర్ ప్లేయర్ మర్లోన్ శాయ్యూల్స్ సొంతం చేసుకున్నాడు. ఆంటిగ్వాలో విండీస్ బోర్డు అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో విండీస్ గెలవడంతో కీలకపాత్ర పోషించడంతో పాటు గత ఏడాది కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న శామ్యూల్స్ కు అవార్డు ప్రకటించి గౌరవించాలని బోర్డు భావించింది.
2015లో 22 వన్డేలాడిన శామ్యూల్స్ 3 సెంచరీల సాయంతో 859 పరుగులు చేశాడు. టీ20 ఫైనల్లో ఛేజింగ్ లో బ్యాటింగ్ కు దిగిన ఈ ఆటగాడు కేవలం 66 బంతుల్లో 85 పరుగులు చేసి విండీస్ ను పొట్టి క్రికెట్లో మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. మహిళల విభాగంలో స్టెఫానీ టేలర్కు టీ20 ప్లేయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కైవసం చేసుకుంది.