చితక్కొట్టిన శాంసన్‌.. రాణించిన రహానే | Samson Smashes Century after Rahane 70 Runs | Sakshi
Sakshi News home page

చితక్కొట్టిన శాంసన్‌.. రాణించిన రహానే

Mar 29 2019 9:47 PM | Updated on Mar 29 2019 9:49 PM

Samson Smashes Century after Rahane 70  Runs - Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజూ శాంసన్‌(102 నాటౌట్‌; 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) చితక్కొట్టగా, అజింక్యా రహానే(70; 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించాడు. దాంతో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(5) నిరాశపరచడంతో రాజస్తాన్‌ 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్‌ల జోడి నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. వీరిద్దరూ 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి రాజస్తాన్‌ను గాడిలో పెట్టారు.

ప్రధానంగా రహానే సొగసైన షాట్లతో అలరించగా, శాంసన్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఉండగా రహానే భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత శాంసన్‌ మరింత రెచ్చిపోయి ఆడాడు. బౌండరీల లక్ష్యంగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా భువనేశ్వర్‌ వేసిన 18ఓవర్‌లో నాలుగు ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 24 పరుగులు సాధించడంతో రాజస్తాన్‌ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇక చివరి ఓవర్‌ మూడో బంతికి శాంసన్‌ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో శాంసన్‌ సెంచరీ సాధించాడు. ఇది ఓవరాల్‌ ఐపీఎల్‌లో శాంసన్‌కు రెండో సెంచరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement