వీటినే వదంతులంటారు! | Sakshi Dhoni Breaks Silence on MS Dhoni Retirement Rumours | Sakshi
Sakshi News home page

వీటినే వదంతులంటారు!

Sep 13 2019 1:48 AM | Updated on Sep 13 2019 9:53 AM

Sakshi Dhoni Breaks Silence on MS Dhoni Retirement Rumours

రాంచీ: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌కు సంబంధించి గురువారం వచ్చిన కొన్ని వార్తలు కలకలం రేపాయి. అతను రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్లు, సాయంత్రం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగింది. ఆసీస్‌తో జరిగిన 2016 టి20 ప్రపంచ కప్‌ క్వార్టర్‌ ఫైనల్లో తాను, ధోని ఉన్న ఫోటో పెట్టి ‘ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్‌ అది. నాకు ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టినట్లు ధోని నాతో పరుగెత్తించాడు’ అని కోహ్లి ట్వీట్‌ చేయడమే పుకార్లకు కారణమైంది. ప్రత్యేక సందర్భం ఏదీ లేకుండా ఇలా ట్వీట్‌ చేయడంతో అందరూ రిటైర్మెంట్‌ గురించి ఆలోచించారు. ధోనికి అలాంటి ఆలోచన ఏదీ లేదంటూ బీసీసీఐ వర్గాలతో పాటు చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ దీనిని ఖండించినా వార్తలు ఆగలేదు. చివరకు అతని భార్య ధోని ‘వీటినే వదంతులు అంటారు’ అంటూ ట్వీట్‌ చేయడంతో ధోని రిటైర్మెంట్‌పై సాగిన చర్చ ముగిసింది! 

Advertisement
 
Advertisement
Advertisement