సైనాకు చుక్కెదురు | saina nehwal defeated | Sakshi
Sakshi News home page

సైనాకు చుక్కెదురు

May 30 2015 12:44 AM | Updated on Sep 3 2017 2:54 AM

సైనాకు చుక్కెదురు

సైనాకు చుక్కెదురు

డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్

 సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. ప్రపంచ ఆరో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, రెండో సీడ్ సైనా 15-21, 13-21తో ఓడిపోయింది. 41 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏదశలోనూ తన ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయింది.

సైనాతో 12వ సారి ఆడుతోన్న షిజియాన్‌కు సైనా బలాబలాలపై అవగాహన ఉండటంతో పక్కా ప్రణాళికతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో సైనా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో ముఖాముఖి రికార్డులో సైనా, షిజియాన్ 6-6తో సమంగా ఉన్నారు. ఈ ఓటమితో సైనా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ మరోసారి చేజారే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement