డెన్మార్క్ ఓపెన్ కు సైనా సిద్ధం | Saina and Company starts campaign at Denmark Open | Sakshi
Sakshi News home page

డెన్మార్క్ ఓపెన్ కు సైనా సిద్ధం

Oct 12 2015 3:05 PM | Updated on Sep 3 2017 10:51 AM

టీవల జరిగిన కొరియా ఓపెన్ కు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్, వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ఆరంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది.

ఓడోన్సీ(డెన్మార్క్):ఇటీవల జరిగిన కొరియా ఓపెన్ కు దూరంగా ఉన్న భారత స్టార్ షట్లర్, వరల్డ్ నంబర్ వన్ సైనా నెహ్వాల్ మంగళవారం నుంచి ఆరంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది. అంతకుముందు 2012 లో డెన్మార్క్ టైటిల్ ను గెలిచిన సైనా మరోసారి ఈ సిరీస్ ను తనఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

 

పురుషుల విభాగంలో గతరాత్రి డచ్ ఓపెన్ ను గెలిచిన అజయ్ జయరామ్ తో పాటు, వరల్డ్ ఐదో ర్యాంక్  క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్,  పారుపల్లి కశ్యప్, ప్రణయ్ లు కూడా డెన్మార్క్ ఓపెన్ కు సన్నద్ధమయ్యారు. ఇదిలా ఉండగా మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పల జోడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement