రెండో రౌండ్‌లో సాయిప్రణీత్ | Sai Praneeth In the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సాయిప్రణీత్

Jun 25 2015 2:42 AM | Updated on Sep 3 2017 4:18 AM

కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్

న్యూఢిల్లీ : కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్‌తోపాటు భారత్‌కే చెందిన అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ శుభారంభం చేశారు. అయితే మరో హైదరాబాద్ ప్లేయర్ గురుసాయిదత్ మాత్రం తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్ 21-11, 21-17తో అలిస్టర్ క్యాసీ (స్కాట్లాండ్)ను ఓడించగా... అజయ్ జయరామ్ 21-10, 21-19తో షి కుయె చున్ (చైనీస్ తైపీ)పై, ఆనంద్ పవార్ 21-9, 21-10తో నికొలస్ వాలెర్ (అమెరికా)పై గెలిచారు. గురుసాయిదత్ 9-21, 14-21తో షి యుకీ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement