సచిన్ బొమ్మ తీసేశారు!! | Sachin Tendulkar's Wax Statue Moved Out of Sydney Tussauds | Sakshi
Sakshi News home page

సచిన్ బొమ్మ తీసేశారు!!

Mar 28 2015 2:59 PM | Updated on Sep 2 2017 11:31 PM

సచిన్ బొమ్మ తీసేశారు!!

సచిన్ బొమ్మ తీసేశారు!!

ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు.

ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు. అప్పట్లో బొమ్మ పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి ఆ బొమ్మను చూడటం.. దాని పక్కనే నిలబడి ఫొటోలు తీయించుకుని అచ్చం మాస్టర్ తోనే ఫొటో దిగినట్లు ఫీలయిపోవడం లాంటివి కనిపించేవి. నాటి బొమ్మలో ఐసీసీ టీ20 టోర్నమెంటులో ధరించినట్లు బ్లూ జెర్సీ రూపం ఉండేది. కానీ.. సచిన్ అసలు ఆ మ్యాచ్లో ఆడలేదన్న విషయాన్ని మిడ్ డే పత్రిక వాళ్ల దృష్టికి తేవడంతో.. రంగు మారుస్తామని చెప్పారు. అయితే.. శుక్రవారం అక్కడికి వెళ్లి చూసిన పత్రిక ప్రతినిధులు షాకయ్యారు. కొన్ని నెలల క్రితమే అక్కడినుంచి సచిన్ మైనపు బొమ్మను తీసేశారు!!

దాన్ని ఇక్కడినుంచి బ్యాంకాక్ పంపామని, ఒకచోటు నుంచి మరో చోటుకు బొమ్మలను పంపడం తమకు సర్వసాధారణమేనని మ్యూజియం సూపర్వైజర్ ఒకరు తెలిపారు. అభిమానులంతా ఎంతో అపురూపంగా చూసుకునే సచిన్ బొమ్మను ఏమాత్రం సమాచారం లేకుండానే తరలించడం ఏంటని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement