సచినే మేటి ఓపెనర్... | Sachin Tendulkar voted in greatest ODI XI of all time | Sakshi
Sakshi News home page

సచినే మేటి ఓపెనర్...

Feb 11 2015 1:04 AM | Updated on Sep 2 2017 9:06 PM

సచినే మేటి ఓపెనర్...

సచినే మేటి ఓపెనర్...

ప్రపంచ దిగ్గజ వన్డే జట్టుకు ఓపెనర్‌గా ఎవరుండాలనే దానిపై జరిగిన ఓ సర్వేలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక ఓట్లు గెలుచుకున్నాడు.

29 శాతం ఓట్లు సాధించిన ‘మాస్టర్’
- ప్రపంచ దిగ్గజ వన్డే జట్టు ఎంపిక

మెల్‌బోర్న్: ప్రపంచ దిగ్గజ వన్డే జట్టుకు ఓపెనర్‌గా ఎవరుండాలనే దానిపై జరిగిన ఓ సర్వేలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక ఓట్లు గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్‌ను మాస్టరే ప్రారంభించాలని 29 శాతం మంది బ్రిటన్ వాసులు కోరుకుంటున్నారు. క్రిస్ గేల్ (వెస్టిండీస్-25 శాతం), గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా-20 శాతం), ఆమ్లా (దక్షిణాఫ్రికా-12 శాతం), జయసూర్య (శ్రీలంక-8 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డివిలియర్స్, బ్రియాన్ లారా, వివియన్ రిచర్డ్స్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను కట్టబెట్టారు.

ఆరో స్థానం కోసం ఆల్‌రౌండర్ కలిస్ పేరును ప్రతిపాదించారు. కెరీర్‌లో 463 వన్డేలు ఆడిన సచిన్ 18,426 పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్ 54 శాతం ఓట్లు సాధించాడు. పాక్ స్వింగ్ కింగ్ వసీమ్ అక్రమ్‌తో పాటు గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, షేన్ వార్న్ ఈ జట్టులో చోటు సంపాదించారు. స్పోర్ట్స్ డే పాఠకులతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆష్లే గేల్స్, జాసన్ గిలెస్పీలు ఈ జట్టును ఎంపిక చేసిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement