బెంగళూరు మ్యాచ్కు వర్షం ఆటంకం | Royal Challengers Bangalore vs Kings XI Punjab match delayed by rain | Sakshi
Sakshi News home page

బెంగళూరు మ్యాచ్కు వర్షం ఆటంకం

May 18 2016 8:05 PM | Updated on Sep 4 2017 12:23 AM

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది.

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆరంభంకావాల్సివుంది. అయితే వర్షం కారణంగా 8 గంటల వరకు టాస్ వేయలేదు.

ఈ రోజు సాయంత్రం నుంచి బెంగళూరులో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారింది. పిచ్ను కవర్లతో కప్పిఉంచారు. ఫ్లే ఆఫ్ బెర్తు ఆశిస్తున్న బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకమైనది. కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినా జట్టు విజయం కోసం ఈ మ్యాచ్లో ఆడనున్నట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement