breaking news
ipl match delay
-
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
-
బెంగళూరు మ్యాచ్‌కు వర్షం ఆటంకం
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆరంభంకావాల్సివుంది. అయితే వర్షం కారణంగా 8 గంటల వరకు టాస్ వేయలేదు. ఈ రోజు సాయంత్రం నుంచి బెంగళూరులో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారింది. పిచ్‌ను కవర్లతో కప్పిఉంచారు. ఫ్లే ఆఫ్ బెర్తు ఆశిస్తున్న బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకమైనది. కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడినా జట్టు విజయం కోసం ఈ మ్యాచ్‌లో ఆడనున్నట్టు వార్తలు వచ్చాయి.


