రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్ | Ronaldo send Portugal into Euro 2016 final | Sakshi
Sakshi News home page

రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్

Jul 7 2016 8:48 AM | Updated on Sep 4 2017 4:20 AM

రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్

రొనాల్డో మ్యాజిక్, ఫైనల్లో పోర్చుగల్

యూరో కప్‌ ఫుట‍్బాల్ టోర్నీలో ఎట్టకేలకు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో మెరిశాడు.

లియోన్: యూరో కప్‌ ఫుట‍్బాల్ టోర్నీలో ఎట్టకేలకు పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డో మెరిశాడు. టోర్నీ ఆరంభం నుంచి స్థాయికి తగిన ప్రదర్శన చేయడంలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న రొనాల్డో.. బుధవారం రాత్రి వేల్స్తో జరిగిన కీలక సెమీస్లో సత్తా చాటడంతో పోర్చుగల్ యూరో కప్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. దీంతో.. సంచలన ప్రదర్శనతో గత 50 ఏళ్లలో ఓ మేజర్ టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి బ్రిటిష్ జట్టుగా చరిత్ర సృష్టించాలని భావించిన వేల్స్కు నిరాశే మిగిలింది.

రెండు జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్ 50వ నిమిషంలో రొనాల్డో అద్భుతమైన హెడ్డర్తో పోర్చుగల్ను ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం రొనాల్డో షాట్ను నాని గోల్గా మలచడంతో 2-0తో పోర్చుగల్ విజయం సాధించింది. గురువారం రాత్రి ఫ్రాన్స్, జర్మనీల మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ విజేతతో పోర్చుగల్ ఫైనల్లో తలపడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement