క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట | Rohan Bopanna In Quarter Final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట

Jan 8 2020 3:47 AM | Updated on Jan 8 2020 3:47 AM

Rohan Bopanna In Quarter Final - Sakshi

దోహా (ఖతర్‌): కొత్త ఏడాదిని భారత టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న విజయంతో ప్రారంభించాడు. దోహా ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో బోపన్న (భారత్‌)–వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–కూలాఫ్‌ ద్వయం 6–3, 6–2తో మార్కో సెచినాటో–లొరెంజో సొనెగో (ఇటలీ) జోడీపై విజయం సాధించింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ప్రత్యర్థి జోడీ సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసి తమ సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement