1 వర్సెస్ 2 | Roger Federer enters into wimbledon finals | Sakshi
Sakshi News home page

1 వర్సెస్ 2

Jul 10 2015 11:00 PM | Updated on Sep 3 2017 5:15 AM

1 వర్సెస్ 2

1 వర్సెస్ 2

వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో వరల్డ్ నబంర్ 2 రోజర్ ఫెదరర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ తో ఫెదరర్ తలపడనున్నాడు.

- వింబుల్డన్ ఫైనల్స్ లోకి టాప్- 2 ర్యాంకర్ ఫెదరద్
- ఆదివారం జరిగే టైటిల్ పోరులో టాప్- 1 ర్యాంకర్ జెకోవిచ్తో ఢీ

లండన్:
వింబుల్డన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో వరల్డ్ నబంర్ 2 రోజర్ ఫెదరర్ ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ మ్యాచ్ లో లోకల్ బాయ్ ఆండీ ముర్రేను 7- 5, 7- 5, 6- 4 తేడాతో ఓడించాడు. ఇప్పటికే ఏడుసార్లు వింబుల్డన్ చాంపియన్ గా నిలిచిన ఫెదరర్.. ఎనిమిదోసారి కూడా టైటిల్ వేటలో తుది అంకానికి చేరుకోవడం గమనార్హం. ఆదివారం జరిగే ఫైనల్స్ లో  డిఫెండింగ్ చాంపియన్,  సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ తో ఫెదరర్ తలపడనున్నాడు. జెకోవిచ్ వింబుల్డన్ ఫైనల్స్ కు చేరుకోవడం ఇది మూడోసారి.

మ్యాచ్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ఫెదరర్కు.. ముర్రే తన స్థాయికి తగ్గట్లుగా ఎదురునిలవలేకపోయాడు. దీంతో పూర్తి ఆధిపత్యం ఫెదరర్దే అయింది. గడిచిన ఏడేళ్లలో వింబుల్డన్ సెమీస్ లో పరాజయం పాలవ్వటం ముర్రేకు ఇది ఏడోసారి.

కాగా, మొదటి సెమీస్లో జొకోవిచ్ 7-6 (2), 6-4, 6-4 స్కోరుతో 21వ సీడ్ రిచర్డ్ గాస్క్వెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. జొకోవిచ్కు తొలిసెట్లో హోరాహోరీ పోరు ఎదురైనా కష్టమ్మీద కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత నొవాక్ మరింత దూకుడు పెంచాడు. వరుసగా రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్ బెర్తు సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement