‘బుమ్రా బౌలింగ్‌ వెనుక రాకెట్‌ సైన్స్‌’

Rocket Science Behind Jasprit Bumrahs Bowling Excellence, IIT Professor - Sakshi

కాన్పూర్‌: భారత అత్యుత్తమ బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఒకడు. తన బౌలింగ్ టెక్నిక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భారత పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌లో బుమ్రానే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. భారత జట్టులోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రధాన బౌలర్‌గా ఎదిగిపోయాడు బుమ్రా. అయితే, బుమ్రా బౌలింగ్ విజయం వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌ కనిపెట్టానని అంటున్నారు.

బుమ్రా స్పీడ్, సీమ్ పొజిషన్ వెనుక రాకెట్‌ సైన్స్‌ దాగి ఉందని తన స్టడీ ద్వారా వెల్లడైందన్నారు. బుమ్రా రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌ను రాబట్టి బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్పష్టం చేశారు. 1,000 ఆర్పీఎమ్‌తో బుమ్రా బంతులు వేస్తున్నాడు కాబట్టి 0.1 నిష్పత్తిలో ఆ బంతికి స్పిన్ తోడవుతుందని తెలిపారు. వేగంతో పాటు సీమ్‌ కలిగిన బుమ్రా విసిరే బంతికి స్పిన్‌ తోడవడంతో బంతి దిశ మారి మాగ్నస్‌ ఫోర్స్‌ కాస్త రివర్స్‌ మాగ్నస్‌ ఫోర్స్‌గా రూపాంతరం చెందుతుందని ఆయన వెల్లడించారు. దీనివల్ల బంతి నేలను తాకిన తర్వాత అనూహ్యంగా బౌన్స్‌ అవుతుందని అన్నారు. దాంతో బ్యాట్స్‌మెన్‌ బుమ్రా బంతుల్ని ఎదుర్కోవడంలో శ్రమించాల్సి వస్తుందన్నారు. బుమ్రా యాక్షన్ భిన్నంగా ఉండటం కూడా అతను వైవిధ్యమైన బంతులు వేయడానికి దోహద పడుతుందన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top