విజేత రిత్విక్‌ జంట | ritwik pair got doubles title of nairobi open | Sakshi
Sakshi News home page

విజేత రిత్విక్‌ జంట

Jul 9 2017 10:48 AM | Updated on Sep 5 2017 3:38 PM

విజేత రిత్విక్‌ జంట

విజేత రిత్విక్‌ జంట

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) నైరోబి జూనియర్‌ ఓపెన్‌–1 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సత్తాచాటాడు.

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) నైరోబి జూనియర్‌ ఓపెన్‌–1 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో నగరానికి చెందిన రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సత్తాచాటాడు. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో బాలుర డబుల్స్‌ విభాగంలో రిత్విక్‌ జంట విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

శనివారం జరిగిన ఫైనల్లో రిత్విక్‌ (భారత్‌)–షేల్‌ కొటెచా (కెన్యా) ద్వయం 6–4, 6–2తో డెన్నిస్‌ మోసెస్‌ (జింబాబ్వే)– చానోన్‌ హున్సావత్‌ (థాయ్‌లాండ్‌) జంటపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో రిత్విక్‌ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌ 2–6, 1–6తో స్కెల్చర్‌ మురో (స్పెయిన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement