‘రిషభ్‌ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’ | Sakshi
Sakshi News home page

‘రిషభ్‌ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’

Published Mon, Jul 20 2020 12:02 PM

Rishabh Pant's Talent Is Getting Wasted, Kirti Azad - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని వారసుడిగా కీపింగ్‌ బాధ్యతలు అందుకుని ఆందుకు తగ్గట్టుగానే ఆరంభంలో మెరిసిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అవకాశాలు కోసం వేచి చూసే పరిస్థితి వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో పంత్‌ వైపు టీమిండియా యాజమాన్యం కానీ సెలక్టర్లు కానీ చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్‌ ఊసే లేకుండా ఉన్నారు. దీనికి కారణం పంత్‌ స్వీయ తప్పిదమే అంటున్నాడు మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌.  పంత్‌లో విపరీతమైన టాలెంట్‌ ఉన్నా గర్వంతోనే ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నాడన్నాడు. (అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు)

‘పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గించాలి. హఠాత్తుగా తన బ్యాటింగ్‌ను మార్చుకుంటాడు. ప్రతీ బంతిని బౌండరీ దాటించాలనుకోవడం అతని చోటుకు చేటు చేసింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను కూడా టీ 20 ఫార్మాట్‌లో ఆడాలంటే ఎలా. ఇది పంత్‌ మార్చుకోవాల్సి ఉంది. పంత్‌ను పక్కన కూర్చోబెట్టడంతో అతని టాలెంట్‌ వృథా అవుతుందనే చెప్పాలి. నువ్వు వికెట్‌ దగ్గర నిలబడటం నేర్చుకుంటే పరుగులు వాటంతటే అవే వస్తాయి. ముందు స్టైక్‌ రోటేట్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. పంత్‌ కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గాను మెరుగ్గా ఉన్నాడు. అయినా పూర్తి స్థాయి టాలెంట్‌ను బయటకు తీయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాల్లో అనవరసర తప్పిదాలు చేసి ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్‌ మళ్లీ కచ్చితంగా అవకాశం ఇచ్చి చూడాలి. అతనికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కూడా సెట్‌ చేస్తే మంచిది. పంత్‌ టాలెంట్‌ వేస్ట్‌ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది’ అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి ఆజాద్‌ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement