పంత్‌.. నా బిడ్డను ఆడిస్తావా : రోహిత్‌ | Rishabh Pant High Demand As Babysitter  | Sakshi
Sakshi News home page

Jan 9 2019 2:44 PM | Updated on Jan 9 2019 2:45 PM

Rishabh Pant High Demand As Babysitter  - Sakshi

పంత్‌.. నీవు మంచి బేబీ సిట్టర్‌ అంట కదా..

ముంబై : టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌.. బ్యాటింగ్‌తో సిరీస్‌ ఆసాంతం వార్తల్లో నిలిచిన ఈ యువ క్రికెటర్‌.. బెస్ట్‌ బేబీసిట్టర్‌గా ఆసీస్‌ కెప్టెన్‌ సతీమణి బొన్ని పైన్‌ చేత కితాబు అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తండ్రైన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సైతం తన కూతురుని ఆడించాలని పంత్‌ను కోరుతున్నాడు. గుడ్‌ మార్నింగ్‌ అనే పంత్‌ ట్వీట్‌కు బదులిస్తూ.. ‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్‌ కావాలి అంటూ సరదాగా పేర్కొన్నాడు. ఇక రోహిత్‌ ఒక్కడే పంత్‌ సాయం కోరడం లేదు.. బొన్ని పైన్‌ సైతం మరోసారి పంత్‌ సాయం కోరింది.

‘పంత్‌ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా!’ అని పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌ 20 క్యాచ్‌లు, 350 పరుగులతో అద్భుతంగా రాణించాడు. వన్డే తుది జట్టులోకి ధోని రావడంతో భారత్‌కు తిరుగొచ్చిన పంత్‌.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ వరకు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. జనవరి 23 నుంచి భారత్‌ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement