రిషభ్‌ పంత్‌ ఖాతాలో మరో ఘనత

Rishab Pant Scored Most runs in a season for DD - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌-11లో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ మరో ఘనత సాధించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టిన పంత్‌ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే సీజన్‌లో ఢిల్లీ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రికార్డ్‌ సృష్టించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఢిల్లీ మాజీ సారథి గౌతం గంభీర్‌ (2008లో 534పరుగులు) పేరిట ఉండగా, ఈ ఏడాది పంత్‌ ఆ రికార్డు బద్దలుకొట్టాడు. ఈ సీజన్‌లో 578 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పంత్‌ కొనసాగుతున్నాడు. ఇక గతంలో ఢిల్లీ తరుపున ఈ ఘనత సాధించిన వారి జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌‌(2012లో 495 పరుగులు), ఏబీ డివిలియర్స్‌(2009లో 465పరుగులు), డికాక్‌ (2016లో 445 పరుగులు)లు ఉన్నారు.

ఇది కూడా చదవండి: రిషబ్‌ రికార్డుల మోత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top