‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

Ricky Ponting Compares Peter Siddle With Glenn McGrath - Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ పేసర్‌ పీటర్‌ సిడెల్‌ రెండు వికెట్లు మాత్రమే తీసినప్పటికీ అతనిపై అసిస్టెంట్‌ కోచ్‌, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ప్రశంసలు కురిపించాడు. పీటెర్‌ సిడెల్‌ బౌలింగ్‌ చూస్తుంటే దిగ్గజ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడంటూ కొనియాడాడు. మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌ యాక్షన్‌కు, సీడెల్‌ బౌలింగ్‌ యాక్షన్‌ చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయంటూ ప్రశంసించాడు. ‘మెక్‌గ్రాత్‌ ఒక గొప్ప బౌలర్‌. అందులోనూ లార్డ్స్‌లో అతనికి ఘనమైన రికార్డు ఉంది. లార్డ్స్‌లో బౌలింగ్‌ చేయడాన్ని మెక్‌గ్రాత్‌ ఎక్కువ ఇష్టపడేవాడు.

ఇప్పుడు పీటర్‌ సిడెల్‌ను చూస్తుంటే నాకు మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు.  మెక్‌గ్రాత్‌ అమోఘమైన స్వింగ్‌ బౌలర్‌ కాదు. కానీ సరైన లెంగ్త్‌లో కింది వాటంలో బౌలింగ్‌ చేయడంలో మెక్‌గ్రాత్‌ దిట్ట. ప్రస్తుతం సిడెల్‌ కూడా అదే తరహాలో బౌలింగ్‌ చేస్తున్నాడు. గత కొంతకాలంగా సిడెల్‌ బౌలింగ్‌ గొప్ప పరిణితి వచ్చింది’ అని పాంటింగ్‌ తెలిపాడు. ఇక హజల్‌వుడ్‌ను పక్కకు పెట్టి సిడెల్‌ను తొలి టెస్టులో ఆడించడంపైఐ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పందించాడు. బర్మింగ్‌హామ్‌ వికెట్‌ అనేది ఫ్లాట్‌ వికెట్‌. ఇది సిడెల్‌కు కచ్చితంగా సరిపోతుందని భావించాం. అందుకే అతన్ని తుది జట్టులో ఎంపిక చేశాం’ అని లాంగర్‌ పేర్కొన్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top