కోహ్లి వికెట్‌ను గుర్తుంచుకుంటా: ఫిలాండర్‌  | Remember Kohli Wicket: Philander | Sakshi
Sakshi News home page

కోహ్లి వికెట్‌ను గుర్తుంచుకుంటా: ఫిలాండర్‌ 

Jan 10 2018 1:19 AM | Updated on Sep 18 2018 8:48 PM

Remember Kohli Wicket: Philander - Sakshi

కేప్‌టౌన్‌ టెస్టులో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అవుట్‌ చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని దక్షిణాఫ్రికా పేస్‌ బౌలర్‌ ఫిలాండర్‌ తెలిపాడు. ‘కోహ్లి దూకుడైన ఆటగాడు. ముందుగా అతడి ఆట కట్టించాలనుకున్నాం. ఆ అవకాశం నాకే దక్కింది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని ఫిలాండర్‌ అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్నపుడు టీమిండియా స్కోరు 71/3... విజయానికి చేయాల్సింది ఇంకా 137 పరుగులే. అప్పటివరకు రెండు స్పెల్స్‌లో విరాట్‌కు ఆఫ్‌ స్టంప్‌పై 13 బంతులు విసిరిన ఫిలాండర్‌... ఒక బంతిని మాత్రం లోపలకు సంధించాడు. దానిని ఫ్లిక్‌ చేయబోయిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement