రవిశాస్త్రి పొట్టపై పేలుతున్న జోకులు

Ravi Shastris pot belly becomes the pot of all jokes on Twitter - Sakshi

లండన్‌: భారత క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా రవిశాస్త్రి మైదానంలో నిలుచొన్న ఉన్న ఓ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో రవిశాస్త్రి పొట్ట కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో అతడి ఫిట్‌నెస్‌‌పై సెటైర్లు పడిపోతున్నాయ్. రవిశాస్త్రి పొట్టను చూసి కామెంట్లతో కామెడీ పండించేస్తున్నారు. ఆటగాడిగా ఉన్నప్పుడు రవిశాస్త్రి ఫిట్‌నెస్‌ బాగానే ఉండేది. టీమిండియా కోచ్‌‌గా మారినా.. రవిశాస్త్రి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం లేదు. ఆటగాళ్లు ఫిట్‌‌గా ఉండాలంటాడే కానీ... అతను మాత్రం బాడీ మీద బ్యాలెన్స్ కోల్పోయాడు.
 
ఇప్పుడు రవిశాస్త్రి పొట్టపై పంచ్‌ల మీద పంచ్‌‌లు వేస్తున్నారు నెటిజన్లు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టులో భాగంగా గ్రౌండ్‌లో నిలుచున్న రవిశాస్త్రి పొట్టను చూపిస్తూ.. డెలివరీకి సిద్ధంగా ఉన్నాడంటూ కొందరు జోకులు వేస్తున్నారు. కోచ్‌‌కూ యో యో టెస్ట్‌ పెట్టాలేమో అని మరికొందరు విమర్శలు సంధింస్తున్నారు. పొట్టను పెంచడం నేరమీమీ కాదని.. అయితే డైటింగ్ చేయడం అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. లార్డ్స్‌‌ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. బెల్లీ విన్నర్ మాత్రం రవిశాస్త్రే అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కోచ్‌ పొట్టను టీమిండియా కెప్టెన్‌ ఆశ్చర్యకరంగా చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోను పెట్టి.. చిత్రవిచిత్రమైన కామెంట్లను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.
 
కాగా కొద్దిరోజుల క్రితం టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ఓ తాగుబోతు అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీనికి సోషల్‌ మీడియా వేదికగా రవిశాస్త్రి పోస్టు చేసిన వీడియోనే కారణం. ఓ ఎనర్జీ డ్రింక్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఓ వీడియోను రవిశాస్త్రి తన ట్విటర్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ రోజు లండన్‌లో చాలా వేడిగా ఉంది. ఈ డ్రింక్‌ తాగి వేడి నుంచి ఉపశమనం పొందండి’ అంటూ పేర్కొన్నాడు. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.  లార్డ్స్‌ టెస్టులో ఎలా గెలవాలన్న దానిపై జట్టుకు సలహాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నావని, తమంతా భారత విజయం కోసం ఎదురు చూస్తున్నామని ఒకరు మండిపడగా.. అసలు నువ్వు కోచ్‌వేనా అని ఇంకొకరు ప్రశ్నించారు. కోచ్‌గా రవిశాస్త్రి జట్టు కోసం ఏం చేస్తున్నాడని మొన్న మ్యాచ్‌ జరిగే సమయంలో నిద్రపోతూ కనిపించాడని.. ఇప్పుడేమో ఇలా ప్రమోషనల్స్‌ అంటూ తిరుగుతున్నాడని మండి పడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top