క్యా బాత్‌ హై రవిశాస్త్రి : రణ్‌వీర్‌ | Ravi Shastri Posted A Picture of Himself Wearing His Team India Blazer | Sakshi
Sakshi News home page

రవిశాస్త్రి పోస్ట్‌కు రణ్‌వీర్‌ రిప్లై

Jun 3 2020 2:20 PM | Updated on Jun 3 2020 2:30 PM

Ravi Shastri Posted A Picture of Himself Wearing His Team India Blazer - Sakshi

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే రవిశాస్త్రి టీమిండియా బ్లేజర్‌ ధరించి ఉన్న ఓ పాత ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా రాజీ పడకుండా కష్టపడేవారే విజయం సాధిస్తారనే అర్థంలో ఆ ఫోటోకు క్యాప్షన్‌ను జతచేశాడు. కాగా, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ రవిశాస్త్రి పోస్ట్‌పై సందిస్తూ ‘క్యా బాత్‌ హై’ అంటూ కామెంట్‌ చేశాడు. (కొందరే ధైర్యంగా ఉంటారు: కోహ్లి)

బాలీవుడ్‌ హీరో కామెంట్‌ చేయడంతో రవిశాస్త్రి చేసిన పోస్ట్‌ మరింత వైరల్‌ అయింది. రణ్‌వీర్‌తో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు రవిశాస్త్రి పోస్ట్‌ను లైక్‌ చేస్తున్నారు.  కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు రవిశాస్త్రి. అయితే ఈ ఖాళీ సమయాన్ని అలీబాగ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా అప్పడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పలు ఆసక్తికర, ఫన్నీ విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. (భర్తను ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్‌)

Advertisement
 
Advertisement
Advertisement