రవిశాస్త్రి.. ఆంధ్ర భోజనం ఫుల్‌గా తింటే? | Ravi Shastri Caught Napping On Camera During First Test | Sakshi
Sakshi News home page

Aug 3 2018 10:42 AM | Updated on Aug 3 2018 2:16 PM

Ravi Shastri Caught Napping On Camera During First Test - Sakshi

తొలి టెస్ట్‌ సందర్భంగా కునుకు తీస్తున్న రవిశాస్త్రి

నీ ఫేవరేట్‌ ఆంధ్ర భోజనం ఫుల్‌గా తింటే ఇలానే ఉంటుంది..

బర్మింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న తొలిటెస్టులో టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తెగ ఇబ్బంది పడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. వస్తున్న నిద్రను ఆపుకోలేక కునుకు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆతిథ్య జట్టు 134/3తో పటిష్ట స్థితిలో ఉండగా.. ఇషాంత్‌ శర్మ వేసిన 46 ఓవర్లో ఇది చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన అభిమానులు రవిశాస్త్రిపై కుళ్లు జోకులు వేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

‘నీ ఫేవరేట్‌ ఆంధ్ర భోజనం ఫుల్‌గా తింటే ఇలానే ఉంటుంది మరీ’ అని కామెంట్‌ చేస్తున్నారు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ 287 పరుగులకు కుప్పకూలడం.. అనంతరం రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మన్‌ విఫలమవ్వడం.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వన్‌ మ్యాన్‌ ఆర్మీ ప్రదర్శనతో 274 పరుగులు సాధించడం తెలిసిన విషయమే. ఇక రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌ కుక్‌ వికెట్‌ కోల్పోయి 9 పరుగులు చేసింది.

చదవండి: దటీజ్‌ కోహ్లి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement