క్వార్టర్స్‌లో రష్మిక | Rashmika in Quarters of ITF Junior Grade Tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రష్మిక

Dec 6 2018 10:11 AM | Updated on Dec 6 2018 10:11 AM

Rashmika in Quarters of ITF Junior Grade Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌ గ్రేడ్‌–3 టోర్నీలో హైదరాబాద్‌ క్రీడాకారులు శ్రీవల్లి రష్మిక, అమినేని శివాని క్వార్టర్స్‌కు చేరుకున్నారు. పుణేలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్‌) 2–6, 7–5, 6–3తో యు యున్‌ లీ (చైనీస్‌ తైపీ)పై, టాప్‌ సీడ్‌ శివాని 6–2, 6–2తో గార్గి పవార్‌ (భారత్‌)పై విజయం సాధించారు. సంజన సిరిమల్ల 3–6, 5–7తో కొహరు నిమి (జపాన్‌) చేతిలో పరాజయం పాలై తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది.

డబుల్స్‌ విభాగంలో రష్మిక జంట క్వార్టర్స్‌లో, శివాని జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాయి. బాలికల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక (భారత్‌)–చెయ్‌ హున్‌ సిమ్‌ (కొరియా) ద్వయం 3–6, 6–3, 10–6తో ప్రియాన్షి–సుదీప్త (భారత్‌) జంటపై గెలుపొంది... క్వార్టర్స్‌లో 2–6, 1–6తో టాప్‌ సీడ్‌ మాటిల్డా ముతాజిక్‌–ఎరిన్‌ రిచర్డ్‌సన్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. శివాని–శరణ్య జంట 1–6, 3–6తో మల్లిక –మెయ్‌ హసేగవా (జపాన్‌) జంట చేతిలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement