విరోష్ జంట ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. విజయ్- రష్మికతో పాటు ఆనంద్ దేవరకొండ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. తమ బంధువుల పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆనంద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో విజయ్ తల్లి కూడా ఉన్నారు. ఇక రష్మిక.. విజయ్ ఒడిలో కూర్చుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా వివాహ వేడుకలో కనిపించారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. విజయ్- రష్మిక పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‍లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవలే పెళ్లై నెల రోజులు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నానంటూ రష్మిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ టాలీవుడ్ కపుల్ రణబలి చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


