సెమీస్‌లో రష్మిక | rashmika enters semis of ITF tourny | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రష్మిక

Jan 27 2017 10:30 AM | Updated on Sep 5 2017 2:16 AM

సెమీస్‌లో రష్మిక

సెమీస్‌లో రష్మిక

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక సెమీస్‌కు చేరుకుంది.


టెన్నిస్‌ టోర్నమెంట్‌  


సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–5 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక సెమీస్‌కు చేరుకుంది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో రష్మిక 5–7, 6–4, 6–3తో సారాపై గెలుపొందగా... మరో మ్యాచ్‌లో వినీత 7–5, 6–4తో వైదేహి చౌదరీని ఓడించింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్‌ 6–3, 7–6తో టాప్‌ సీడ్‌ రిషభ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement