రషీద్‌ గూగ్లీకి ధోని బౌల్డ్‌ | Rashid gets Dhoni as pressure mounts on CSK | Sakshi
Sakshi News home page

రషీద్‌ గూగ్లీకి ధోని బౌల్డ్‌

May 22 2018 9:49 PM | Updated on May 22 2018 9:49 PM

Rashid gets Dhoni as pressure mounts on CSK - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 39 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే ఆరంభంలోనే తడబడింది.  షేన్‌వాట్సన్‌ డకౌట్‌గా తొలి వికెట్‌ రూపంలో పెవిలియన్‌ చేరగా, సురేశ్‌ రైనా(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై వెంటనే అంబటి రాయుడు డకౌట్‌గా నిష్ర్కమించాడు. దాంతో సీఎస్‌కే 24 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది.

ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో ఎంఎస్‌ ధోని(9) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. సన్‌రైజర్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వేసిన గూగ్లీని అంచనా వేయడంలో విఫలమైన ధోని వికెట్‌ను సమర్పించుకున్నాడు. దాంతో సీఎస్‌కే శిబిరంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొనగా, సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆనందం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement